ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీ : వంద సీట్లు ఖాయమన్న సీఎం కేసీఆర్

congవచ్చే ఎన్నికల్లో వందకు పైగా సీట్లలో టీఆర్ఎస్ గెలవడం ఖాయమన్నారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలో కొత్తగా చేయించిన సర్వే వివరాలను త్వరలోనే బయటపెడతానన్నారు. ఎన్నికలకు వెళ్తే ఎవరి సత్తా ఏంటో తెలుస్తుందన్నారు కేసీఆర్. తెలంగాణ భవన్ లో కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు మాజీ మంత్రి దానం నాగేందర్. దానంకు మంచి అవకాశాలు, భవిష్యత్తు ఉందన్నారు కేసీఆర్. దానం నాగేందర్ టీఆర్ ఎస్ లో చేరింది సుఖపడేందుకు కాదని, ప్రజలకు మరింత సేవచేసేందుకే దానం టీఆర్ ఎస్ లో చేరారన్నారు కేసీఆర్. తెలంగాణ ఉద్యమం ఓ చరిత్ర, రాష్ట్ర పునర్నిర్మాణం మరో చరిత్ర అన్నారు.  కాంగ్రెస్ నేతలు చిల్లర మాటలు మానుకోవాలన్నారు కేసీఆర్. రాష్ట్రానికి లబ్ధి జరగాలనే ప్రాజెక్టుల రీడిజైన్ చేశామన్నారు. కులం, మతం, పార్టీలకతీతంగా పథకాలను ప్రజలకు అందిస్తున్నామన్నారు. పండుగల సందర్భంగా కులమతాలకతీతంగా అందరినీ సమానంగా గౌరవిస్తున్నామన్నారు. మన రైతు దేశానికే ఆదర్శం కావాలన్నారు కేసీఆర్. మంచి ప్రభుత్వాన్ని ప్రజలు వదులు కోరన్నారు కేసీఆర్.

Posted in Uncategorized

Latest Updates