ఎన్నికలే టార్గెట్ : ప్రారంభమైన CWC మీటింగ్

రాహుల్ గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశం న్యూఢిల్లీలోని పార్లమెంటు అనెక్స్‌ లో ఆదివారం (జూలై-22) ప్రారంభమైంది. పార్టీ అధ్యక్షుడి హోదాలో రాహుల్ సీడబ్ల్యూసీ సమావేశానికి అధ్యక్షత వహించడం ఇదే మొదటిసారి. ఈ సమావేశంలో UPA చైర్‌పర్సన్ సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, ఏకే ఆంటోనీ, గులాం నబీ ఆజాద్ తదితరులు పాల్గొన్నారు.

2019 ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించడమే ప్రధాన ఎజెండాగా CWC సమావేశమైంది. ఈ ఏడాది చివర్లో జరుగనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, పొత్తుల వ్యవహారంపై కూడా సమావేశంలో చర్చిస్తారని తెలుస్తోంది. 13 రాష్ట్రాల్లో పొత్తుల వ్యవహారం సమావేశంలో చర్చకు రానుంది. రెండ్రోజుల క్రితమే అవిశ్వాస తీర్మానం వీగిపోయిన క్రమంలో CWC సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.

Posted in Uncategorized

Latest Updates