ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తాం: అమిత్ షా

ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకునేది లేదని తేల్చి చెప్పారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా. త్వరలో కర్ణాటక లో జరగనున్న జరిగే అన్ని స్థానాల్లోనూ తాము పోటీ చేస్తామని.. మెజారిటీ ప్రభుత్వాన్ని సొంతంగా ఏర్పాటు చేస్తామన్నారు. మైసూరులో రెండో రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం(మార్చి-31) పాల్గొన్నారు. కర్ణాటకాలో పొత్తుల్లేకుండానే పోటీచేసి తాము సొంతంగా అధికారంలోకి వస్తామన్నారు. కొన్ని స్థానాల్లో త్రిముఖ పోటీ ఉందన్నారు.  ప్రతి దగ్గర బీజేపీ  మిగతా అన్ని పార్టీలకు గట్టి పోటీ ఇస్తుందన్నారు. లింగాయత్‌లకు మైనారిటీ హోదాపై కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందని…ఇన్నేళ్లుగా ప్రభుత్వంలో ఉంటూ కూడా ముందే ఆ పని ఎందుకు చేయలేకపోయిందని పశ్నించారు షా. ఇది కేవలం లింగాయత్ ఓట్లను చీల్చేందుకు చేస్తున్న కుట్ర అన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటున్నానని తెలపారు అమిత్ షా. అవినీతికి వారు విసిగిపోయారని, అభివృద్ధిని వారు కోరుకుంటున్నారన్నారు. నీటిని విడిచి చేప ఎలా ఉండలేదో అవినీతి లేకుండా కాంగ్రెస్ లేదని ఆరోపించారు. ఐటీలో రాష్ట్రం బలంగా ఉన్నప్పటికీ ఇప్పటికీ 24 గంటల నిరంతరాయ విద్యుత్ లేదని, ఆరోగ్యం, కేంద్ర పథకాల అమలులో కూడా సిద్ధరామ్యయ సర్కార్ విఫలమైందన్నారు. మైసూర్ లో 3,500 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని..అయినా వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు అమిత్ షా.

Posted in Uncategorized

Latest Updates