ఎన్నికల్లో TRS సెంచరీ కొట్టడం ఖాయం: కేటీఆర్

త్వరలో జరగనున్న ఎన్నికల్లో TRS సెంచరీ కొట్టడం ఖాయమన్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణ భవన్‌లో జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగం విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ప్రస్తుత రాజకీయాలపై విద్యార్థులకు ఎక్కువ అవగాహన ఉందన్నారు. కేసీఆర్‌ను ఎందుకు గెలిపించాలో అది కూడా విద్యార్థులకే ఎక్కువ తెలుసన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో టీఆర్‌ఎస్ భారీ మెజార్టీతో గెలిచిందన్నారు. నీళ్ల విషయంలో కోటి ఎకరాలు మాగాణం కావాలనే సంకల్పంతో కాళేశ్వరం, పాలమూరు, సీతారామ ప్రాజెక్టులను నిర్మిస్తున్నామన్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు నింపుతున్నామని… మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు ఇవ్వబోతున్నట్లు తెలిపారు. తెలంగాణ మంచి ఆర్థిక ప్రగతిని సాధించిందన్నారు కేటీఆర్.

కాగ్రెస్ నాయకుడు భట్టి విక్రమార్కపై వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. ఒక కుటుంబానికి.. ప్రజల మధ్య జరుగుతున్న పోరాటం అని భట్టి అంటున్నారు. అవును నిజం.. ఇవాళ రాహుల్ కుటుంబానికి, తెలంగాణ ప్రజల మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవి అన్నారు. రాహుల్ గాంధీ కుటుంబానికి, తెలంగాణ పౌరుషానికి మధ్య జరుగుతున్న పోటీ… ఢిల్లీ బలుపుకు, తెలంగాణ ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న పోరాటం అని కేటీఆర్  చెప్పారు. 1956 నుంచి 2014 వరకు తెలంగాణను మోసం చేసిన రాహుల్ కుటంబానికి, తెలంగాణ ప్రజల మధ్య ఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్‌కు ఓటు దెబ్బతోనే సమాధానం చెప్పాలన్నారు కేటీఆర్. ఏ అమరవీరుల కుటుంబం వచ్చి కాంగ్రెస్, టీడీపీతో పొత్తు పెట్టుకోమని కోదండరామ్‌కు చెప్పిందని ప్రశ్నించారు. ముష్టి మూడు సీట్ల కోసం కోదండరామ్ కాంగ్రెస్ దగ్గర పొర్లు దండాలు పెడుతున్నారన్నారు కేటీఆర్.

Posted in Uncategorized

Latest Updates