ఎన్నికల టైం: ఆదిలాబాద్ లో పట్టుబడ్డ రూ.10కోట్ల నగదు

రాష్ట్రంలోఎన్నికల టైం దగ్గర పడుతుండటంతో ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరింప జేస్తున్నారు. దీంతో పాటు నిఘా పెంచారు. ఆదిలాబాద్‌లో పోలీసులు ఇవాళ (శుక్రవారం) తనిఖీలు నిర్వహించగా రూ.10కోట్ల నగదు పట్టుబడింది. పట్టుబడ్డ నగదుపై పోలీసులు ఆరా తీస్తున్నారు. జిల్లాలోని జైనథ్ మండలం చెక్‌పోస్టులో తనిఖీలు చేసి పోలీసులు నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల్లో ఖర్చుచేసేందుకు డబ్బును తరలిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎన్నికల్లో డబ్బులను విచ్చల విడిగా ఖర్చు చేయకుండా అడ్డుకునేందుకు ఎలక్షన్‌ కమిషన్‌ కసరత్తులు మొదలుపెట్టింది.

Posted in Uncategorized

Latest Updates