ఎన్నికల తేదీలాగే కేసీఆర్ అంచనాలు తప్పుతాయి.. బీజేపీ సెటైర్

హైదరాబాద్ : టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాటలను జనం నమ్మే పరిస్థితి లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు అన్నారు. కేసీఆర్ లాజికల్ గా ఆలోచించే వ్యక్తి కాదన్నారు. గతంలో రాజీనామాలు చేయడం వేరు ఇప్పుడు అసెంబ్లీ రద్దు చేయడం వేరని.. కేసీఆర్ బాధ్యత లేకుండా రద్దు చేశారని విమర్శించారు. మూడెకరాల భూమి,అంబెడ్కర్ విగ్రహం, మాదిగ భవన్ అన్నారు .. ఎక్కడా అమలు చేయలేదన్నారు.

 

రైతు ఆత్మహత్యలపై లెక్కలు తారుమారు చేస్తున్నారని .. ఉద్యోగాలపై టీఆర్ఎస్ కు క్లారిటీ లేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ ఛార్జ్ షీట్ వేస్తుందన్నారు. నవంబర్ లో ఎన్నికలు వస్తాయని కేసీఆర్ చెప్పారని… ఐతే… డిసెంబర్ లో వస్తున్నాయని అన్నారు మురళీ ధర్ రావు. రాబోయే రోజుల్లో కేసీఆర్ అంచనాలు తారుమారు అవుతాయని అన్నారు. రేపు(బుధవారం-అక్టోబర్10) అమిత్ షా పర్యటనలోఅన్నింటికీ సమాధానం ఇస్తారని చెప్పారు. మహాకూటమితో ఒరిగేదేమీ లేదని.. సీపీఎం కోసం సాలార్ జంగ్ మ్యూజియం ఎదురుచూస్తోందని అన్నారు.

Posted in Uncategorized

Latest Updates