ఎన్నికల నియమాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఈసీ

ఎన్నికల నియమావళిపై కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. నిబంధనల ఉల్లంఘన కిందకు వచ్చే అంశాలేంటనే వాటిపై రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్‌కుమార్ తెలిపారు. ప్రభుత్వ స్థలాల్లో ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు ఉండటానికి వీళ్లేదన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న అన్ని పోస్టర్లు, కటౌట్లు వెంటనే తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. 24 గంటల్లో రైల్వేస్టేషన్, బస్‌స్టేషన్లు, విమానాశ్రయాల్లో పోస్టర్లు, బ్యానర్లు తొలగించాలన్నారుర. ఇంటి యజమాని అనుమతితోనే బ్యానర్లు కట్టాలి,  వాల్ పోస్టర్లు అతికించాలన్నారు. అనుమతి లేకుంటే 72 గంటల్లో వాటిని తొలగించాలన్నారు. ఎన్నికల పనుల కోసం నేతలు ప్రభుత్వ వాహనాలు ఉపయోగించరాదన్నారు. ప్రతి జిల్లాలో, సీఈఓ కార్యాలయంలో 24 గంటల కాల్ సెంటర్ ఏర్పాటు చేశామని చెప్పారు. డిసెంబర్ 7న 119 స్థానాలకు ఒకే సారి పోలింగ్ ఉంటుందని…. డిసెంబర్ 11న కౌంటింగ్ ఉంటుందని తెలిపారు. ఎవరైనా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలనుకుంటే 1950 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయాలన్నారు. ఫిర్యాదులన్నింటిని ఎన్నికల సంఘానికి నివేదిస్తామన్నారు. కొనసాగుతున్న పనుల వివరాలు 72 గంటల్లో కలెక్టర్లు ఎన్నికల సంఘానికి తెలపాలని… కొత్త పనులు ప్రారంభించరాదని ఆదేశించారు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్‌కుమార్.

 

Posted in Uncategorized

Latest Updates