ఎన్నికల పండగ.. పల్లె బాటపట్టిన ఓటర్లు

ఎన్నికల పండగ రావడంతో.. నగరవాసులంతా.. సొంత ఊళ్లకు బయల్దేరారు. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు… ఎంత బిజీగా ఉన్నా.. అన్ని పనులు పక్కనబెట్టి.. పల్లె బాట పట్టారు. దీంతో.. హైదరాబాద్ లోని అన్ని బస్టాండ్లలో ఫుల్ రష్ కనిపించింది. ప్రయాణికుల కోసం.. స్పెషల్ బస్సులను కూడా ఏర్పాటు చేసింది ఆర్టీసీ.

పోలింగ్ శుక్రవారం రోజు కావడం.. తర్వాత శని, ఆదివారాలు వీకెండ్ కావటంతో.. నగరంలో నివసిస్తున్న పల్లె ఓటర్లంతా వీకెండ్ ప్లాన్ తో ఊళ్లకు వెళ్తున్నారు. ఓటు వేయడంతో పాటు ఊళ్లో బంధువులందరినీ కలిసి మజా చేయాలని ఫిక్సయ్యారు. ఫ్యామిలీ అంతా కలిసి.. పట్నం వీడి పల్లె బాట పట్టారు. దీంతో.. ఎంజీబీఎస్, జేబీఎస్, ఆరాంఘర్, ఎల్బీనగర్ ప్రాంతాల్లో.. రష్ ఎక్కువగా ఉంది.

ప్రయాణికుల రద్దీ పెరగడంతో.. వారికి ఇబ్బంది కలగకుండా ఆర్టీసీ అధికారులు ఇప్పటికే ఏర్పాటు చేశారు. కరీంనగర్, వరంగల్, కామారెడ్డి, నిజామాబాద్ ఏరియా నుంచి కూడా ఇక్కడికి బస్సులు తెప్పించామని తెలిపారు. సిటీ బస్సులు కూడా దూర ప్రాంతాలకు వెళ్లేలా ఏర్పాటు చేశామంటున్నారు అధికారులు. జనం రద్దీని బట్టి.. ఆయా రూట్లలో ఎప్పటికప్పుడు బస్సులు తిప్పుతున్నామని చెప్తున్నారు.

దసరా, సంక్రాంతి లాంటి పెద్ద పండుగల సమయంలోనే.. బస్టాండ్లలో ఈ రేంజ్ రష్ చూస్తుంటాం. కానీ.. ఓట్ల పండుగ వచ్చేసరికి.. మళ్లీ ఆ సీన్ కనిపిస్తోంది. జనంలో కూడా ఓటేయాలనే అవగాహన రావడంతో.. అంతా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెళ్తున్నామని చెప్తున్నారు. ఎన్ని స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసినా.. కొన్ని ప్రాంతాలకు వెళ్లాలంటే.. గంటల తరబడి వెయిట్ చేయాల్సి వస్తోందని ప్రయాణికులు చెప్తున్నారు. ఆర్టీసీ అధికారులు ఎప్పటికప్పుడు స్పందించి.. రద్దీ ఎక్కువగా ఉన్న రూట్లలో.. వీలైనన్ని ఎక్కువ బస్సులు తిప్పాలని కోరుతున్నారు ప్రయాణికులు.

Posted in Uncategorized

Latest Updates