ఎన్నికల సంబంధిత ఉద్యోగుల బదిలీకి ఈసీ అనుమతి

????????????????????????????????????

హైదరాబాద్ : డిసెంబర్ ఏడున రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండటంతో… అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు రాష్ట్ర ఎన్నికల అధికారులు. ఎన్నికల నిర్వహణలో ఎటువంటి అక్రమాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. ఎన్నికలు జరిగే చోట.. ఎలక్షన్ నిర్వహణలో పాల్గొనే ఉద్యోగులను నియమ నిబంధనలకు అనుగుణంగా బదిలీ చేస్తుంటారు. అలా… మూడేళ్ళ నుండి ఒకే చోట విధులు నిర్వహిస్తూ… ఎన్నికల నిర్వహణకు సంబంధం ఉన్న ఉద్యోగులను బదిలీ చేసేందుకు ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇచ్చింది. ప్రభుత్వ యంత్రాంగం ఈ నిబంధనలకు లోబడి ఉన్న ఉద్యోగులను బదిలీ చేసేందుకు సిద్ధమైంది.

మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కింద… మూడేళ్లుగా ఒకే ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న టీచర్లు, జీనియర్ లెక్చరర్లు, లెక్చరర్లను బదిలీ చేయడానికి హైదరాబాద్ లోని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కార్యాలయం పర్మిషన్ ఇచ్చింది. 2వందలమంది తెలంగాణలో ట్రాన్స్ ఫర్ పైన కానీ.. డిప్యుటేషన్ పైన కానీ.. బదిలీ కానున్నారు.

Posted in Uncategorized

Latest Updates