ఎప్పటికైనా నెంబర్ వన్ : బ్రహ్మోస్ జీవితకాలం పెంపు

BRAMHOSటెక్నాలజీతో మిస్సైళ్ల ఖర్చు చాలా వరకు తగ్గుతుందన్నారు రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్. సోమవారం (మే-21) ఆర్మీ అభివృద్ధి కోసం మొదటిసారిగా ఇండియన్ డిఫెన్స్ ఆధ్యర్యంలో చేపట్టిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ పరీక్ష విజయవంతమైంది. ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా స్పందించిన మంత్రి.. ఈ పరీక్ష సక్సెస్ కావడం వల్ల.. డిఫెన్స్ టీమ్‌ కు కంగ్రాట్స్ చెప్పారు.  లైఫ్ ఎక్స్ టెన్షన్ ప్రోగ్రామ్ క్రమంలో దీన్ని ప్రయోగించారు.

ఈ ప్రయోగంలో భాగంగా ఫస్ట్ టైంగా ఇండియన్ డిఫెన్స్ చేపట్టడంతో..బ్రహ్మోస్ జీవితకాలాన్ని పొడిగించారు. మిస్సైల్ లైఫ్ ను 10 ఏళ్ల నుంచి 15 ఏళ్ల కాలానికి పెంచేశారు. దీనివల్ల భారీ స్థాయిలో క్షిపణి ఖర్చు తగ్గే అవకాశం ఉంది. ఒరిస్సా తీరంలో ఈ పరీక్ష జరగనుంది. బ్రహ్మోస్ లైఫ్ ను పొడిగించడం వల్ల ఇండియన్ ఆర్మీకి మేలు జరగనుంది. బ్రహ్మోస్ జీవిత కాలాన్ని పొడిగిస్తూ రూపొందించిన టెక్నాలజీలను భారత్ మొదటిసారి డెవలప్ చేసింది.

Posted in Uncategorized

Latest Updates