ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన ప్రతి ఒక్కరికి సెల్యూట్ : మోడీ

NarendraModiఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన ప్రతీ ఒక్కరికీ సెల్యూట్ చేస్తున్నా అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. వారి పోరాటం… ప్రజల హక్కులు కాపాడిందని మంగళవారం (జూన్-26) ట్వీట్ చేశారు. ఎమర్జెన్సీని ఒక చీకటి అధ్యాయంగా భారత్ గుర్తు చేసుకుంటోందన్నారు. ఆ కాలంలో ప్రతీ సంస్థ ధ్వంసమైందని… ప్రజల్లో భయాందోళన ఏర్పడిందన్నారు. అధికారం కోసం చేసిన రాజకీయాల్లో స్వేచ్ఛ బందీ అయిందన్నారు మోడీ. ప్రజాస్వామ్య పద్దతిలో పనిచేద్దామని పిలుపునిచ్చారు ప్రధాని. రచించడం, ప్రశ్నించడం, చర్చించడం ప్రజాస్వామ్యంలో కీలకమన్నారు.

Posted in Uncategorized

Latest Updates