ఎమ్మెల్యేల అనర్హత కేసు : వేర్వేరు తీర్పు ఇచ్చిన హైకోర్టు జడ్జీలు

palaniswami-dhinakaranతమిళనాడు రాష్ట్రంలో రాజకీయం మళ్లీ మొదటికి వచ్చింది. పళనిస్వామి సీఎం అయిన తర్వాత.. దినకనర్‌ వర్గానికి చెందిన 18మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు తమిళనాడు స్పీకర్. స్పీకర్ నిర్ణయంపై హైకోర్టును ఆశ్రయించారు ఆ 18 ఎమ్మెల్యేలు. ఈ కేసులో ఎవరూ ఊహించని ట్విస్ట్‌ జరిగింది. కేసును విచారించిన ఇద్దరు జడ్జీలు.. భిన్నాభిప్రాయాలతో వేర్వేరు తీర్పులనిచ్చారు. ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం ఏకాభిప్రాయంతో స్పష్టమైన తీర్పు వెలువరించకపోవడంతో ఈ కేసు మళ్లీ మొదటికి వచ్చింది. దీంతో కేసు విచారణను విస్తృత ధర్మాసనానికి బదలాయించారు.

దినకరన్‌ వర్గానికి చెందిన 18మంది ఎమ్మెల్యేలపై స్పీకర్‌ వేసిన అనర్హత వేటు చెల్లుతుందని జస్టిస్‌ ఇంద్రాణి బెనర్జీ తీర్పునివ్వగా.. స్పీకర్‌ నిర్ణయం తప్పని జస్టిస్‌ సెల్వం తీర్పునిచ్చారు. తీర్పులోనే స్పష్టత లేకపోవటంతో.. సీఎం పళనిస్వామి ప్రభుత్వానికి ఊరట లభించింది. 18 మంది ఎమ్మెల్యేల అనర్హత కేసులో తీర్పు ఎలా వచ్చినా.. పళనిస్వామి ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవు. ప్రస్తుతం ఇద్దరు సభ్యుల హైకోర్ట్ బెంచ్.. విరుద్ధ తీర్పులు ఇవ్వటంతో మరోసారి పళనిస్వామి ఊపిరిపీల్చుకున్నారు.

కేసు వివరాలు ఏంటీ :

2017 సెప్టెంబర్‌లో పళనిస్వామి ప్రభుత్వం అసెంబ్లీలో బలపరీక్ష సందర్భంగా అన్నాడీఎంకేకు చెందిన 18మంది ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని స్పీకర్‌ రద్దు చేశారు. విప్‌కు వ్యతిరేకంగా శశికళ అక్క కొడుకైన దినకనర్‌కు మద్దతు తెలపడంతో స్పీకర్‌ వారిపై అనర్హత వేటు వేశారు. వారి నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించాలని స్పీకర్‌  ఎన్నికల సంఘాన్ని కోరారు. స్పీకర్‌ నిర్ణయంపై వేటు పడిన ఎమ్మెల్యేలు మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు స్టే ఇచ్చింది. 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయంలో మద్రాస్‌ హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనేది ఉత్కంఠ రేపుతోంది. వీరి సభ్యత్వాల రద్దును ఆమోదిస్తూ హైకోర్టు తీర్పునిస్తే.. ఉప ఎన్నికలు వచ్చే అవకాశముంది. ఒకవేళ స్పీకర్‌ నిర్ణయాన్ని వ్యతిరేకించి.. హైకోర్టు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ఎత్తివేసినా పళని ప్రభుత్వానికి సంకటమే. ఈ క్రమంలో ఇద్దరు జడ్చీల ధర్మాసనం వేర్వేరు తీర్పులు వెలువరించడంతో పళనిస్వామి ప్రభుత్వానికి ఉపశమనం దొరికింది.

Posted in Uncategorized

Latest Updates