ఎమ్మెల్యేల ఎన్నికపై ఈసీ రాజపత్రం విడుదల

హైదరాబాద్: రాష్ట్రంలో 119 ఎమ్మెల్యేలు ఎన్నికైనట్లుగా కేంద్ర ఎన్నికల సంఘం  గెజిట్ నోటిఫికేషన్ ను ఇవాళ(డిసెంబర్.12) విడుదల చేసింది. దీంతో సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి లైన్ క్లియర్ అయ్యింది. రేపు మధ్యాహ్నం 1.25 రాజ్ భవన్ లో కేసీఆర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరోవైపు ఇవాళ టీఆర్ఎస్ భవన్ లో టీఆర్ ఎస్ఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ 88 మంది ఎమ్మెల్యేలు కేసీఆర్ ను శాసన సభాపక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

తర్వాత పార్టీ నేతలు తలసాని శ్రీనివాస యాదవ్, లక్ష్మారెడ్డి, పద్మా దేవేందర్ రెడ్డి. వినయ్ భాస్కర్, పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు గవర్నర్ నరసింహన్ ను కలిసి కేసీఆర్ ని టీఆర్ఎస్ శాసన సభాపక్ష నాయకుడిగా ఎన్నుకున్నట్లుగా లేఖ అందచేశారు.ఈ ఏకగ్రీవ తీర్మానాన్ని గవర్నర్ ఆమోదించారు.

Posted in Uncategorized

Latest Updates