ఎమ్మెల్యే ఇంటిపై బుల్లెట్ల వర్షం..తప్పిన ప్రమాదం

మీరుట్‌ :  బీజేపీ ఎమ్మెల్యే సంగీత్‌ సోమ్‌ ఇంటిపై గుర్తు తెలియని దుండగులు బుల్లెట్ల వర్షం కురిపించారు. బుల్లెట్లు, హ్యాండ్‌ గ్రెనేడ్‌ తో సంగీత్‌ ఇంటిపై దాడి చేశారు. సెక్యురిటీ గార్డు ఇచ్చిన సమాచారం ప్రకారం మీరట్ లో అర్థరాత్రి 12.45 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగినట్టు తెలిపారు పోలీసులు. స్పాట్‌ లో ఖాళీ బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

వాటికి ఫోరెన్సి క్‌ టీమ్‌ పరిశీలిస్తుందని తెలిపారు మీరుట్‌ పోలీసులు.  హ్యాండ్‌ గ్రెనైడ్‌ ను కూడా గుర్తించినట్టు చెప్పారు. అదృష్టవశాత్తు ఎవరి ప్రాణానికి ఎలాంటి ప్రమాదం జరగలేదని, సెక్యురిటీ గార్డు క్యాబిన్‌ ను, ఎమ్మెల్యే ఇంటి మెయిన్‌ గేట్‌ ను టార్గెట్ గా చేసుకుని అర్థరాత్రి కాల్పులు జరిపినట్లు తెలుస్తోందన్నారు.  ఎమ్మెల్యే ఇంటి పరిసర ప్రాంతంలో ఉన్న CCTV ఫుటేజీని పరిశీలిస్తున్నారు. దుండగులు ఎవరో కనుకొనే ప్రయత్నంలో ఉన్నారు.  ఎమ్మెల్యే సోమ్‌ ను కూడా పోలీసులు విచారిస్తున్నారు. రెండేళ్ల క్రితం కూడా తనకు బెదిరింపు హెచ్చరికలు వచ్చాయని ఎమ్యెల్యే చెప్పారు. ఆ సమయంలో తనను గ్రెనైడ్‌ చంపుతామని బెదిరించారన్నారు. అయితే.. ఈ మధ్య కాలంలో బెదిరింపులేమీ రాలేదన్నారు ఎమ్మెల్యే సోమ్.

Posted in Uncategorized

Latest Updates