ఎమ్మెల్యే గొంగిడి సునీతకు తప్పిన ప్రమాదం

SUNITHA
ప్రభుత్వ విప్, ఆలేరు MLA గొంగిడి సునీతకు తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్ అయ్యింది. బుధవారం (జూన్-6) హైదరాబాద్ లోని RTC క్రాస్ రోడ్ మీదుగా నాగోల్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో రెండు కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రమాదంపై స్పందించిన ఎమ్మెల్యే సునీత మాట్లాడుతూ..రెప్పపాటు సమయంలో ప్రమాదం జరిగిందని, యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి కృపవల్ల తాను ప్రమాదం నుంచి బయటపడ్డానని తెలిపారు. ప్రస్తుతం ఆమె నాగోల్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. కార్లను సర్వీస్ సెంటర్ కు తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Posted in Uncategorized

Latest Updates