ఎమ్మెల్యే రెచ్చగొట్టే వ్యాఖ్యలు : అయిదుగుర్ని కనండి.. హిందుత్వాన్ని రక్షించండి

ఐదుగురి పిల్లల్ని కనండి హిందు మతాన్ని పెంచండి అంటూ ఓ బీజేపీ ఎమ్మెల్యే చేసిన కామెంట్ప్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రతి హిందు జంట.. అయిదుగురి పిల్లల్ని కనాలని అన్నారు. హిందుత్వాన్ని రక్షించుకోవాలంటూ అలా చేయక తప్పదన్నారు. బాలియా నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ గతంలోనూ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

హిందూ మతాన్ని కాపాడుకోవాలంటే హిందువులు జనాభాను పెంచాలన్నారు. హిందువు జంటలు ప్రతి ఒక్కరూ అయిదుగుర్ని కనాలని ప్రతి ఆధ్మాతిక గురువు భావిస్తుంటారని, ఈరకంగానైనా జనాభాతో హిందూ ధర్మాన్ని రక్షించుకోవచ్చు అన్నారు. పెరుగుతున్న అత్యాచారాలను రాముడు కూడా నియంత్రించలేరని ఇటీవల ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ ఓ కామెంట్ చేశారు. అత్యాచారం సహజ కాలుష్యమని, ప్రతి ఒక్కర్నీ తమ కుటుంబంగా, సోదరిగా భావించాలని, విలువల ద్వారానే అత్యాచారాలను నియంత్రించ వచ్చు అని, రాజ్యాంగం ద్వారా కాదు అని ఎమ్మెల్యే అన్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ పై సీరియస్ అవుతున్నారు నెటిజన్లు. ప్రశాంతంగా ఉన్న దేశంలో మతాల పేర్లతో రెచ్చగొట్టేవ్యాఖ్యలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates