ఎమ్మెల్సీ పదవికి కొండా మురళి రాజీనామా

శాసన మండలి సభ్యత్వానికి కొండా మురళి రాజీనామా చేశారు. మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ తో ఇవాళ (శనివారం) సమావేశమైన  ఆయన…రాజీనామా పత్రాన్ని సమర్పించారు. 2015లో స్థానిక సంస్థల కోటాలో టీఆర్ఎస్ తరపున ఎన్నికైన కొండా మురళి అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరారు.

కాంగ్రెస్ లో చేరిన నలుగురు ఎమ్మెల్సీలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ చేసిన ఫిర్యాదుతో వివరణ ఇవ్వాల్సిందిగా వారికి మండలి ఛైర్మన్ నోటీసులు జారీ చేశారు. దీంతో స్వామిగౌడ్ తో సమావేశమైన అయిన కొండా మురళి తన రాజీనామా పత్రాన్ని ఆయనకు అందజేశారు. తమకు పదవుల కన్నా ఆత్మాభిమానమే ముఖ్యమని కొండా దంపతులు అన్నారు.

 

Posted in Uncategorized

Latest Updates