ఎమ్మెల్సీ రాములు నాయక్ పై టీఆర్ఎస్ సస్పెన్షన్

హైదరాబాద్ : ఎమ్మెల్సీ రాములు నాయక్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది టీఆర్ఎస్. కొద్దిరోజులుగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో టీఆర్ఎస్ అధిష్టానం.. ఆయనపై వేటు వేసింది. టీఆర్ఎస్ మొదట ప్రకటించిన 105 మంది అభ్యర్థుల్లోనూ ఆయన పేరు లేదు. కాంగ్రెస్ పార్టీ తరఫున అసెంబ్లీకి పోటీ చేయాలన్న ఆలోచనతో ఆయన ఉన్నారన్న సమాచారంతో టీఆర్ఎస్ యాక్షన్ తీసుకుంది.

షోకాజ్ ఇవ్వకుండా సస్పెండ్ చేయడం అన్యాయమనీ… పార్టీకి ఇన్నాళ్లు సేవల చేసినందుకు ఇస్తున్న విలువ ఇదేనా అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ విమర్శలు చేశారు రాములు నాయక్. తెలంగాణ గాంధీ కేసీఆరే అని చెప్పిన రాములు నాయక్.. తెలంగాణ ద్రోహులు ఆయన చుట్టూ కోటరీగా మారి.. మమ్మల్ని దూరం చేశారని అన్నారు. టీఆర్ఎస్ ప్రైవేటు లిమిటెడ్ పార్టీగా మారిందన్నారు. తెలంగాణ ద్రోహులు కేసీఆర్ రూంలో వుంటే తాము బయట కూర్చొని ఎదురు చూడటం బాధాకరం అన్నారు. త్వరలో గిరిజన మేధావులతో సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా అన్నారు. తాను ఎన్నికల్లో పోటీ చేయననీ.. అవసరం లేదనీ.. గిరిజనులకు కేసీఆర్ ఇస్తానన్న రిజర్వేషన్ రావాలని అన్నారు.

Posted in Uncategorized

Latest Updates