ఎయిమ్స్ నిర్మాణానికి జైట్లీ అంగీకారం : కేసీఆర్

jaitelykcrఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ గురువారం (ఫిబ్రవరి-15) కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీతో సమావేశం అయ్యారు. విభజన చట్టం ప్రకారం వెనుకబడిన ప్రాంతాలకు కేంద్రం సాయం చేయాలని సీఎం కేసీఆర్ కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీని కోరారు. పాత 10 జిల్లాల్లోని 9 జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా గుర్తించినందుకు జైట్లీకి సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు.

కేంద్రం 2014-2017 వరకు మూడు ఆర్థిక సంవత్సరాలకు రూ.450 కోట్ల చొప్పున మొత్తం రూ. వెయ్యి 350 కోట్లు విడుదల చేసినట్లు ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఎయిమ్స్ నిర్మాణానికి వెంటనే నిధులు విడుదలకు అంగీకారం తెలిపినట్లు తెలిపారు. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలకు 2017-18 సంవత్సరానికి నిధులు రాలేదని, వాటిని విడుదల చేయాలని కోరగా..నిధులు మంజూరుకు జైట్లీ హామీనిచ్చినట్లు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

Posted in Uncategorized

Latest Updates