ఎయిమ్స్ లోనే కేబినెట్ మీటింగ్ నిర్వహించనున్న పారికర్

కొన్నిరోజులుగా అనారోగ్య కారణాలతో ఢిల్లీ ఎయిమ్స్ నుంచే పాలనా వ్యవహారాలు చక్కబెడుతున్నారు గోవా సీఎం మనోహర్ పారికర్. ఇప్పుడు ఎయిమ్స్ లోనే కేబినెట్ మీటింగ్ ను కూడా ఏర్పాటు చేశారు. బీజేపీ, ఇతర మిత్రపక్షాలైన ఎంజీపీ, జీఎఫ్ పీ నుంచి మంత్రులు ఇవాళ ఎయిమ్స్ లో జరిగే కేబినెట్ మీటింగ్ లో పాల్గొననున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి.

రాష్ట్ర పాలనా వ్యవహారాలకు సంబంధించిన అంశాలపై మంత్రులు, కూటమి నేతలతో పారికర్‌ ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలోనే శాఖల మార్పులపై కూడా చర్చ జరిగే అవకాశాలున్నాయి. కొంతకాలంగా పాన్‌ క్రియాటిక్ సమస్యతో బాధపడుతున్న పారికర్‌ సెప్టెంబర్- 15న ఢిల్లీ ఎయిమ్స్ లో చేరారు.

Posted in Uncategorized

Latest Updates