ఎయిర్‌ పోర్ట్‌ లో దిగాల్సిన విమానం..సముద్రంలో మునిగిపోయింది

వెల్లింగ్టన్: ప్రయాణికులతో వెళ్తోన్న విమానం అకస్మాత్తుగా ఓ భారీ నీటి మడుగులో ల్యాండ్ అయ్యింది. ఈ ఘటన పసిఫిక్ సముద్రంలోని మైక్రోనేషియన్ దీవుల్లో జరిగింది. ఎయిర్ నుగినికి చెందిన విమానం.. వాస్తవానికి వీనో ఎయిర్‌ పోర్ట్‌ లో దిగాల్సి ఉంది. కానీ ఆ రన్‌వేపై ప్లేన్ దిగలేదు. రన్‌ వేకు 150 మీటర్ల దూరంలో ఉన్న ఓ నీటి సరస్సులో విమానం ల్యాండ్ అయ్యింది.

అయితే విమానంలో ఉన్న 36 మంది ప్రయాణికులు, 11 మంది సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు అధికారులు చెప్పారు. ప్రమాదానికి సంబంధించిన కారణాలు ఇంకా బయటకు రాలేదు. విమానం నీటిలో దిగగానే.. స్థానికలు బోట్లు వేసుకుని సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విమానంలో చిక్కుకున్న వారిని ప్రాణాలతో రక్షించారు. ఆ తర్వాత విమానం మెల్లమెల్లగా ఆ సముద్ర నీటిలో ముగినిపోయింది. పాపువా న్యూ గునియా దేశానికి చెందిన ఎయిర్ నుగిని ఈ ఘటన పట్ల విచారణకు ఆదేశించింది. విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో వర్షం ఉందని, చాలా తక్కువ ఎత్తులో విమానం ప్రయాణిస్తోందని,  రన్‌ వే చివరి భాగాన్ని విమానం తాకడం వల్ల అది ఎగిరి సముద్ర నీటిలో పడిందని తెలిపారు ప్రత్యక్షసాక్షులు.

Posted in Uncategorized

Latest Updates