ఎయిర్ క్రాఫ్ట్ హ్యాంగర్ కూలి.. ఇద్దరు నేవీ సిబ్బంది మృతి

కేరళలోని నేవల్ బేస్ లో ఎయిర్ క్రాఫ్ట్ హ్యాంగర్ కూలి ఇద్దరు నేవీ సిబ్బంది మృతి చెందారు. ఈ విషయాన్ని రక్షణశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. హెలికాఫ్టర్ హ్యాంగర్ కు సంబంధించి భారీ తలుపు ఒకటి ఇద్దరు నేవీ సిబ్బంది పై పడటంతో వారు తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు. తీవ్రంగా గాయపడిన వారిని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తుండగా ఇద్దరూ మరణించారని ఆయన అన్నారు. మరణించిన వారి వివరాలను నేవీ అధికారులు ఇంకా వెల్లడించలేదు. ప్రమాద ఘటనపై నేవీ విచారణకు ఆదేశించింది.

Posted in Uncategorized

Latest Updates