ఎయిర్ టెల్ 5G టెస్ట్ రన్ సక్సెస్

5g2G పోయింది 3G వచ్చింది. 3Gపోయింది 4G వచ్చింది. అయితే ఇప్పుడు 4G కూడా పోయి 5G  వచ్చేసింది భారత్ లో. భారత్ లో 5G నెట్ వర్క్ ట్రైల్ ను విజయవంతంగా నిర్వహించాయి టెలికాం కంపెనీలు ఎయిర్ టెల్, హువావే. గురుగావ్‌లోని మానేసర్‌ దగ్గర ఉన్న ఎయిర్‌టెల్‌ నెట్‌వర్క్‌ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌లో ఈ ట్రయల్స్‌ జరిగాయి. ఇందులో 3 గిగాబైట్‌ పర్‌ సెకన్‌ (GBPS) కుపైగా డేటా స్పీడ్‌ను సాధించినట్లు ఈ రెండు కంపెనీలు ప్రకటించాయి. 5జీ దిశగా మా ప్రయాణానికి తాజా ట్రయల్స్‌ చాలా కీలకమైనవి, మన జీవన విధానాన్ని మార్చేయగలిగే శక్తిసామర్థ్యాలు 5జీకి ఉన్నాయని, భారత్‌లో ఈ కొత్త టెక్నాలజీ ఏర్పాటుకు మా భాగస్వాములతో కలిసి పనిచేస్తామని  అని భారతీ ఎయిర్‌టెల్‌ నెట్‌వర్క్స్‌ డైరెక్టర్‌ అభయ్‌ సావర్గొంకర్‌ తెలిపారు. తాము 5జీ టెక్నాలజీ అభివృద్ధికి, దాని ఉపయోగాలపై ముఖ్యంగా దృష్టి పెట్టామని హువావే వైర్‌లెస్‌ మార్కెటింగ్‌ డైరెక్టర్‌ ఎమ్మాన్యూల్‌ కోయెల్హో అల్వెస్‌ తెలిపారు.

 

Posted in Uncategorized

Latest Updates