ఎయిర్ పోర్టు క్యాంటీన్ ఫుడ్డులో బల్లి… ప్యాసింజర్ కు వాంతులు

ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో మఫిన్స్ తిన్న ప్రయాణికుడు అనారోగ్యం పాలయ్యాడు. విమానం ఆలస్యం కావడంతో… అతడు ఎయిర్ పోర్టు లాంజ్ లో ఉన్న క్యాంటీన్ కు వెళ్లాడు. అక్కడ మఫిన్స్(బేకరీ ప్రొడక్ట్) కొనుక్కుని తిన్నాడు. కొద్ది సేపటికే అతడు వాంతులతో ఇబ్బందిపడ్డాడు. ఎయిర్ పోర్ట్ సిబ్బంది అతన్ని హాస్పిటల్ లో చేర్పించారు.

ఇష్యుపై దర్యాప్తు జరిపిన పోలీసులు.. షాకింగ్ విషయాలు తెల్సుకున్నారు. క్యాంటీన్ లో ఆ బేకరీ ప్రొడక్ట్ తింటున్నప్పుడు అందులో బల్లి అవశేషాలు కనిపించాయని బాధిత ప్యాసింజర్ చెప్పాడు. ఈ ఘటనపై DCP సంజయ్ భాటియా విచారణ జరుపుతున్నారు. ప్రయాణికుడు తిన్న ఆహారాన్ని సేకరించి విచారణ జరుపుతున్నామని చెప్పారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. డిసెంబర్ 18న జరిగిన ఈ విషయం ఆలస్యంగా బయటకు వచ్చింది. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలోనే కాదు.. ఎయిర్ పోర్టు క్యాంటీన్లలో పుడ్డు విషయంలోనూ ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చిందని పబ్లిక్ అనుకుంటున్నారు.

Posted in Uncategorized

Latest Updates