ఎయిర్ సెల్-మ్యాక్సిస్ కేసు : నిందితులుగా చిదంబరం, కార్తీ

ఎయిర్ సెల్ మాక్సిస్ మనీ లాండరింగ్ కేసులో మాజీ కేంద్ర ఆర్ధిక మంత్రి చిదంబరం బుక్కయ్యారు. చిదంబరంతో పాటు ఆయన కుమారుడు కార్తీని నిందితులుగా తేల్చింది CBI. గురువారం (జూలై-19) పటియాలా హౌజ్ కోర్టులో ఈ కేసుకు సంబంధించి సప్లిమెంటరీ చార్జ్‌షీట్‌ ను దాఖలు చేసింది CBI. నెల రోజుల కిందటే కేసుకు సంబంధించి ఎన్‌ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చార్జిషీటు దాఖలు చేసిన విషయం తెలిసిందే.

చిదంబరం అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు చార్జ్‌షీట్‌ లో తెలపింది CBI. నిబంధనలను మార్చి ఎయిర్‌ సెల్‌ లో గ్లోబల్ కమ్యూనికేషన్ హోల్డింగ్ సర్వీసెస్ లిమిటెడ్ పెట్టుబడులు పెట్టేలా ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు(FIPB ) క్లియరెన్స్ ఇచ్చారని సీబీఐ స్పష్టంచేసింది.

ఈ కుంభకోణంలో చిదంబరాన్ని డైరెక్ట్ గా నిందితుడిగా చెప్పడం ఇదే తొలిసారి. గతంలో ED దాఖలు చేసిన చార్జిషీటులో చిదంబరం పేరును పలుసార్లు ప్రస్తావించినా.. ఎక్కడా ఆయనను నిందితుడిగా తెలుపలేదు.  చిదంబరం, కార్తీతోపాటు 9 మంది ప్రభుత్వ, ఎయిర్‌ సెల్ మాక్సిస్ అధికారుల పేర్లను నిందితుల లిస్టులో చేర్చింది. జూలై 31న ఈ చార్జిషీటును కోర్టు పరిగణనలోకి తీసుకోనుంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న చిదంబరాన్ని ఆగస్ట్ 7 వరకు అరెస్ట్ చేయొద్దని కోర్టు ఇప్పటికే స్పష్టంచేసింది.

Posted in Uncategorized

Latest Updates