ఎయిర్ హోస్టెస్ కేసు : BMW కారు, డైమండ్ రింగ్ ఇచ్చినా వేధింపులే

జర్మన్ ఎయిర్ లైన్స్ లో ఎయిర్ హోస్టెస్ అనీషియా బత్రా (39) ఆత్మహత్య కేసు కొత్త మలుపు తిరిగింది. అనీషియా భర్త మయన్ష్ సింగ్వీ.. తమ కూతుర్ని హింసించి చంపేశాడని అనీషియా తల్లిదండ్రుల కంప్లెయింట్ తో పోలీసులు విచారణ చేపట్టారు. అనీషియా, ఆమె భర్త ఫోన్ సంభాషణలను పరిశీలిస్తున్నారు. పెళ్లి అయిన మూడో రోజు నుంచే మయన్ష్ సింగ్వీ.. అనీషియాను వేధించడం ప్రారంభించాడని తేలింది. ఈ విషయాన్ని స్వయంగా తమ కూతురే ఫోన్ చేసి చెప్పిందని అనీషియా తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన కంప్లెయింట్ లో తెలిపారు. పెళ్లి సమయంలో అనీషియా తల్లిదండ్రలు వరుడుకి ఇచ్చినBMW కార్, డైమండ్ రింగ్ ను పోలీసులు సీజ్ చేశారు.

జులై-13న సౌత్ ఢిల్లీలోని పంచశీల్ పార్క్ లో ఉన్న తన ఇంటి టెర్రస్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. వెంటనే ఆమె భర్త దగ్గర్లోని హాస్పిటల్ కు తీసుకెళ్లగా.. అప్పటికే అనీషియా చనిపోయినట్లు డాక్టర్లు నిర్దారించారు. ఢిల్లీ హౌజ్ కాస్ పోలీసులు దీన్ని అన్ నాచురల్ డెత్ గా కేసు నమోదు చేశారు. వరకట్న వేధింపుల కింద అనీషియా భర్తపై కేసు నమోదు చేశారు. మయన్ష్ సింగ్వీ గుర్గావ్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates