ఎయిర్ హోస్టెస్… విమానం నుంచి కింద పడింది

బైక్ పై నుంచి కింద పడటం… బస్సునుంచి జారి పడటం అనే మాట ఇప్పటి వరకు విన్నాం…చూశాం. కానీ విమానం నుంచి కింద పడటం అనే మాట వినడం  ఇప్పటి వరకు జరగలేదు. కానీ ఇది నిజం. ఎయిరిండియాకు చెందిన ఓ ఎయిర్ హోస్టెస్ విమానం నుంచి కింద పడి పోయింది. ఈ ఘటన ముంబైలోని చత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిపోర్టులో సోమవారం(అక్టోబర్-15) జరిగింది.

53 ఏళ్ల హర్షా లోబో అనే ఆ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. న్యూఢిల్లీకి వెళ్లాల్సిన ఎయిరిండియా AI 864 విమానంలో ఆమె ఎయిర్‌హోస్టెస్‌గా పని చేస్తోంది. బోయింగ్ 777 విమానం డోరు వేయబోతూ ఆమె కింద పడిపోయింది. దీంతో ఆమె కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయని.. వెంటనే నానావతి ఆస్పత్రికి తరలించినట్లు ఎయిర్‌లైన్స్ అధికారులు చెప్పారు.

 

 

Posted in Uncategorized

Latest Updates