ఎరుపు దుస్తుల్లో సూసైడ్ అటెంప్ట్.. ఆగిన రైలు

కేసముద్రం: ఆత్మహత్య చేసుకునేందుకు ఓ యువతి రైలుకు ఎదురుగా వెళ్ళింది. డ్రైవర్‌ అప్రమత్తమై రైలును ఆపివేయడంతో ఆమె ప్రాణాలతో బయట పడింది. మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం రైల్వే స్టేషన్‌ సమీపంలో నిన్న(మంగళవారం) ఈ సంఘటన జరిగింది.

కుటుంబ సభ్యులతో గొడవ జరగడంతో కేసముద్రంలోని ఎర్రగడ్డ కాలనీకి చెందిన 20 ఏళ్ల యువతి ఆత్మహత్య చేసుకునేందుకు రైలు పట్టాల మీదుగా రైలుకు ఎదురుగా వచ్చింది. ఆ సమయంలో కేసముద్రం స్టేషన్‌ నుంచి శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ కదులుతోంది. ఆ యువతి ఎరుపురంగు దుస్తులు ధరించి ఉండటం,  అప్పుడే రైలు ప్రారంభం కావడంతో వేగం తక్కువగా ఉండటం మూలంగా డ్రైవర్‌ ఒక్కసారిగా బ్రేక్‌ వేశారు. దీంతో ఆ యువతికి అతి సమీపంలో రైలు ఆగిపోయింది.

ఒక్కసారిగా రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఆందోళన పడ్డారు. ఇంతలో అక్కడికి చేరుకున్న అమ్మాయి కుటుంబ సభ్యులు డ్రైవర్ ను దేవుడివంటూ మొక్కుకున్నారు. యువతిని తమ వెంట తీసుకెళ్ళారు.

Posted in Uncategorized

Latest Updates