ఎర్రచందనం స్మగ్లర్ల దాడి : అటవిశాఖ ఉద్యోగి మృతి

ఏపీలోని కడప జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్ల దాడిలో గాయపడి అటవిశాఖ తాత్కాలిక ఉద్యోగి ఒకరు చనిపోయారు. రాత్రి  సిద్దవటం రేంజీలోని రోలబోడు అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తున్న ఫారెస్ట్ సిబ్బందిపై తమిళ కూలీలు రాళ్లతో దాడి చేశారు. దీంతో అటవీశాఖ సిబ్బంది గాల్లోకి కాల్పులు జరిపారు. స్మగ్లర్ల దాడిలో తీవ్రంగా గాయపడిన అశోక్ ను  రిమ్స్  హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందుతూ అతడు చనిపోయాడు.  తెల్లవారుజామున  చంద్రగిరి దగ్గర సచ్చినోడి బండ ప్రాంతంలో కూంబింగ్ చేస్తున్న  టాస్క్ ఫోర్స్ సిబ్బందికి మరోసారి ఎదురుపడ్డారు స్మగ్లర్లు. దీంతో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. 21 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. తమవారిని విడిపించుకునేందుకు మిగిలిన  స్మగ్లర్లు  దాడికి ప్రయత్నించడంతో  …  టాస్క్ ఫోర్స్ సిబ్బంది గాలిలోకి కాల్పులు జరిపింది.

Posted in Uncategorized

Latest Updates