ఎలా నడుస్తోంది : హీరో మహేశ్ షూటింగ్ లో సీఎం

maheshukcm

హీరో మహేశ్ బాబు షూటింగ్ జరుగుతోంది.. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు.. యూనిట్ సిబ్బంది అంతా హడావిడి.. ఇంతలో సెక్యూరిటీ హడావిడి.. పోలీస్ సైరన్స్.. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపు సీఎం స్పాట్ కు వచ్చేశారు. అందరూ ఆశ్చర్యపోయారు. యూనిట్ సిబ్బందిలో చాలా మంది ఆయన ముఖ్యమంత్రి అని కూడా తెలియదు. తెలిసిన తర్వాత అవాక్కయ్యారు. ఇంతకీ ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్ కాదండీ.. ఉత్తరాఘండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్.. హీరో మహేశ్ బాబు కూడా షాక్ అయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ప్రిన్స్ మహేశ్ కొత్త సినిమా షూటింగ్ ఉత్తరాఖండ్ లోని డెహ్రడూన్ లోని జరుగుతుంది. దీనికి దర్శకుడు వంశీ పైడిపల్లి. ఈ మూవీ కోసమే ఎప్పుడూ లేని విధంగా గడ్డం, మీసాలు కూడా పెంచాడు సూపర్ స్టార్. శరవేగంగా షెడ్యూల్ జరుగుతుంది. రైతు సమస్యలను అధ్యయనం కోసం ఉత్తరభారతం వెళ్లిన ముగ్గురు విద్యార్థులు ఎదుర్కొన్న ఇబ్బందులు.. అక్కడి ప్రభుత్వ విధానాలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించిన కథ ఇది. ఈ క్రమంలోనే డెహ్రడూన్ లోని పల్లెల్లో షూటింగ్ జరుగుతుంది. సీఎం త్రివేంద్రసింగ్ రావత్.. అధికారిక కార్యక్రమంలో భాగంగా సిటీలో పర్యటిస్తున్నారు. ఓ చోట హడావిడి చనిపించింది. ఏంటీ అని ఆరా తీశారు సెక్యూరిటీని. ఏదో తెలుగు సినిమా షూటింగ్ అంట సార్.. అని చెప్పారు. అంతే వెంటనే షూటింగ్ దగ్గరకు వచ్చారు. హీరో మహేశ్ బాబుతో ముచ్చటించారు. కథ గురించి అడిగి.. ఆసక్తిగా విన్నారు. మొన్ననే భరత్ అనే నేను సినిమాలో సీఎంగా నటించాడు ప్రిన్స్.. ఇప్పుడు రియల్ సీఎంతో ముచ్చటించారు. ఈ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంలో తెగ చక్కర్లు కొట్టేస్తోంది…

Posted in Uncategorized

Latest Updates