ఎలా మోసింది : పిండం కాదు.. బండరాయి

50-pound-cystఆమె పేరు కైలారహ్న. వయస్సు 30 ఏళ్లు. ఊరు అమెరికాలోని వాషింగ్టన్. రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకుంది. ఫ్యామిలీ హ్యాపీగా సాగుతోంది. ఇటీవల కైలారహ్న కడపు పెరగటం మొదలైంది. పెగ్నెన్సీ అని అందరూ సంబురపడ్డారు. దీనికితోడు ఆమె భారీ కాయం కూడా. దీంతో ఎంత పెరుగుతుందో అర్థం కాలేదు. ఇంట్లో వారు కూడా గుర్తించలేకపోయారు. అయితే నెలలు గడిచే కొద్ది కడుపు పెద్దగా అవుతుంది. ఎంతలా అంటే భరించలేనంతగా. భారీ కాయం కావటంతో కైలారహ్న కూడా బరువు పెరుగుతుంది అనుకున్నారు కానీ.. కడపులోని తెలియని కణితి పెరుగుతుందని గుర్తించలేకపోయింది. ఫ్యామిలీ సభ్యులు అయితే ట్విన్స్ (కమలలు) అనుకున్నారు. గర్భవతులకు ఉండాల్సిన లక్షణాలు లేకపోవటం అనుమానం వచ్చింది. అలబామా, మోంట్గోమేరీలోని జాక్సన్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షలు చేశారు. మైండ్ బ్లాంక్ అయ్యింది.

కడుపులో పెరుగుతున్నది పిల్లలు కాదు.. కణితి అని తేల్చారు. వెంటనే ఆపరేషన్ చేశారు. పుచ్చకాయ ఆకారంలో.. రాయిలా గట్టిగా ఉన్న 50 పౌండ్ల బరువు ఉన్న కణితిని బయటకు తీశారు. ఇది ఎప్పుడో మొదలైంది అని.. అయితే భారీ కాయం కారణంగా ఎవరూ గుర్తించలేకపోయారని తెలిపారు వైద్యులు. ఈ శస్త్రచికిత్స చేస్తున్నప్పుడు ఆ యువతి నరకం అనుభవించిందని తెలిపారు. విపరీతమైన నొప్పిని భరించాల్సి వచ్చింది చెప్పారు. శస్త్రచికిత్స చేసి తీసిన ఈ కణితిని.. అండాశయతిత్తిగా ధృవీకరించారు సర్జన్లు. ఆమెను కొద్ది రోజుల పాటు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంచారు. ఇంత పెద్దగా ఉన్నంత వరకు తెలియలేదా అంటే.. మొదట్లో చిన్నగానే ఉందని.. ఏడాది కాలంగా భారీగా పెరుగుతూ వచ్చిందని.. అందుకే గుర్తించలేకపోయాం అంటున్నారు కుటుంబ సభ్యులు. ఇటీవల కాలంలో ఇంత పెద్ద కణితిని కడుపు నుంచి వెలికితీయటం ఇదే..

Posted in Uncategorized

Latest Updates