ఎలా మోసిందో : కిడ్నీలో 3వేల రాళ్లు

కిడ్నీలో ఓ మహిళకు 3వేల రాళ్లను బయటికి తీశారు డాక్టర్లు.  అవును మీరు విన్నది నిజమే ఒకటి కాదు..రెండు కాదు 3వేలకు పైమాటేనని చెప్పారు డాక్టర్లు. చైనాకు చెందిన జాంగ్ అనే మహిళకు గత కొంతకాలం బ్యాక్ పెయిన్ తో బాధపడుతోంది.  ఈ క్రమంలో జాంగ్.. వుజ్జిన్ ఆస్పత్రి డాక్టర్లను సంప్రదించింది. దీంతో ఆమెకు డాక్టర్లు ట్రీట్ మెంట్ చేశారు.  పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు షాక్ కు గురయ్యారు. ఆమె కుడి మూత్ర పిండం మొత్తం రాళ్లతో నిండినట్లు నిర్ధారించారు డాక్టర్లు. ఒక గంట పాటు సర్జరీ చేసి.. జాంగ్ మూత్ర పిండంలో నుంచి 3వేల రాళ్లను బయటకు తీశారు డాక్టర్లు.

అయితే బాధిత మహిళకు కిడ్నీలో రాళ్లు ఉన్నాయని తెలుసు.  వేల సంఖ్యలో రాళ్లు ఉండటాన్ని చూసి ఆమె షాక్‌ కు గురైంది.  అయితే కిడ్నీలో రాళ్లు వచ్చిన పేషెంట్లలో భారతీయుడిదే ఆల్‌ టైమ్‌ రికార్డ్‌.  గిన్నిస్‌ రికార్డుల ప్రకారం మహారాష్ట్రకు చెందిన ధన్‌ రాజ్‌ వాడిలే కిడ్నీ నుంచి రికార్డు స్థాయిలో 1,72,155 రాళ్లను సర్జరీ చేసి విజయవంతంగా తొలగించారు.

 

Posted in Uncategorized

Latest Updates