ఎల్బీనగర్ – అమీర్ పేట్ మెట్రో లైన్ ప్రారంభం ఇవాళే

హైదరాబాద్ : హైదరాబాద్ మెట్రో రైల్ లో మరో కీలకమైన కారిడార్ జనాలకు అందుబాటులోకి వస్తోంది. ఇవాళ(సెప్టెంబర్ 24-సోమవారం) 16 కిలోమీటర్ల పొడవైన ఎల్బీనగర్-అమీర్ పేట్ మెట్రో లైన్ ప్రారంభం కాబోతోంది. ఎల్బీనగర్-మియాపూర్ కారిడార్ లో భాగంగా… ఇప్పటికే అమీర్ పేట్ – మియాపూర్ రైలు నడుస్తోంది. ఈ లైన్ ..ఇపుడు ఎల్బీనగర్ వరకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తోంది.

మొత్తం 29 కిలోమీటర్ల పొడవైన ఎల్బీనగర్-మియాపుర్ లైన్… మెట్రోలోనే కీలకమైన కారిడర్ అంటున్నారు HMR అధికారులు. ఎల్బీనగర్ -మియాపూర్ మధ్య మొత్తం 27 స్టేషన్లు ఉంటాయి. 45 నిమిషాల్లో ఈ చివర నుంచి ఆ చివరకు చేరుకోవచ్చు. ఈ రూట్లో ప్రయాణికులకు ఇదో అద్భుతమైన సౌకర్యం అని మెట్రో రైలు , జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు.

ఇవాళ మధ్యాహ్నం 12గంటల 15నిమిషాలకు ఎల్బీనగర్- అమీర్ పేట్ మెట్రో లైన్ ను ప్రారంభించబోతున్నారు రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్. ఇటీవలే గవర్నర్ ను కలిసి మెట్రో రైలు ప్రారంభంపై గవర్నర్ తో చర్చించారు రాష్ట్ర మున్సిపల్, ఐటీ మంత్రి కేటీఆర్. సోమవారం మెట్రో రైల్వే లైన్ ప్రారంభించాలని రిక్వెస్ట్ చేశారు. అందుకు గవర్నర్ అంగీకరించారు. కీలకమైన అమీర్ పేట ఇంటర్ జంక్షన్ నుంచి అమీర్ పేట్- ఎల్బీనగర్ మెట్రో రైలును గవర్నర్ ప్రారంభించబోతున్నారు. ఆ తర్వాత మొదటి రైలులో గవర్నర్, మంత్రి , నేతలు , అధికారులు ప్రయాణించే అవకాశం ఉంది.

Posted in Uncategorized

Latest Updates