ఎల్లంపల్లి ప్రాజెక్టులో భారీ చేప..మత్య్సకారుల సంబురం

YLLAMPALLY PROJECT BIG FISHసముద్రంలో పెద్ద సైజు చేపలు ఉంటాయని అందరికీ తెలుసు. అయితే సముద్రంలో పెరిగే చేపలాగే పెద్దపల్లి జిల్లాలో 25 కిలోలో భారీ చేప కనిపించింది. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం ఎల్లంపల్లి ప్రాజెక్టులో మంగళవారం (జూన్-26) తెల్లవారుజామున ఓ మత్స్యకారుడికి భారీ చేప లభించింది. పాలకుర్తి మండలం వేంనూర్‌కు చెందిన బోరే రామన్న రోజు మాదిరిగా ఎల్లంపల్లి డ్యాంలోకి చేపల వేటకు వెళ్లగా, వలకు 25 కిలోల బరువు ఉన్న చేప చిక్కడంతో సంబురపడ్డాడు.

ఈ చేపను రూ.2 వేల 500కు విక్రయించినట్టు మత్స్యకారుడు తెలిపాడు. ఎల్లంపల్లి ప్రాజెక్టు వల్లే తమకు ఉపాధి లభిస్తుందని ఇక్కడి మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఉచిత చేపపిల్లల పంపిణీ చేయడంతో ఈ వర్షాకాంలోనూ ..మరిన్ని చేపలను చెరువుల్లో పెంపకం చేపడుతామని చెబుతున్నారు మత్య్సకారులు. ఇంతకుముందు ఇంత సైజు చేపలను చూడలేదని చెబుతున్నారు.

Posted in Uncategorized

Latest Updates