ఎల్ జీ కొత్త ఫోన్ : మన హావభావాలను బట్టి ఫోటో

lgఎల్ జీ వీ30ఎస్ థిన్‌క్యూ పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం ఎల్‌ జీ. ఈ ఫోన్ లో ఉన్న కెమెరా AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఆధారంగా పనిచేస్తుంది. దీంతో పలు రకాల వస్తువులను ఈ కెమెరా సులభంగా గుర్తించి వాటికి తగినట్టుగా కలర్, బ్రైట్‌నెస్‌లను అడ్జస్ట్ చేస్తుంది. ఫొటోలు చాలా క్వాలిటీగా వస్తాయి. ఈ  ఫోన్‌లో క్యూలెన్స్ అనే సాఫ్ట్‌వేర్‌ను ఏర్పాటు చేశారు. దీంతో పలు రకాల వస్తువులపై ఉండే క్యూ ఆర్ కోడ్స్‌ను సులభంగా రీడ్ చేయవచ్చు. అదే విధంగా ఫోన్‌లో ఉన్న బ్రైట్ మోడ్ సహాయంతో ఫొటోలు, వీడియోలను మరింత క్వాలిటీగా వస్తాయి. సోమవారం(ఫిబ్రవరి26) బార్సిలోనాలో జరిగే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2018 లో ఈ ఫోన్ ను ఎల్ జీ ప్రదర్శించనుంది.

ఈ ఫోన్ ఫీచర్లు……
6 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ప్లస్ ఓలెడ్ ఫుల్ వ్యూ డిస్‌ప్లే, 2880 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128/256 జీబీ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, 16, 13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0, వైర్‌లెస్ చార్జింగ్.

Posted in Uncategorized

Latest Updates