ఎవడబ్బ సొమ్మని ఇది : మరో బ్యాంక్ ను ముంచిన వజ్రాల కంపెనీ

oriental-bankవజ్రాల వ్యాపారుల టైం బాగోలేదా.. కాలం కలిసి రావటం లేదా.. ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే అవుననే అంటున్నాయి. నిన్నటికి నిన్న నీరవ్ మోడీ 11వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోతే.. ఇప్పుడు మరో వజ్రాల వ్యాపారి ద్వారకా దాస్ సేథ్ కూడా బ్యాంకులకు అప్పులు ఎగ్గొట్టిన లిస్ట్ లో చేరారు. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ కు దాస్ సేథ్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రూ.389 కోట్లు తీసుకుని చెల్లించలేదు. దీంతో బ్యాంక్.. ఆయనపై సీబీఐకి కంప్లయింట్ చేసింది. కేసు నమోదు చేసిన అధికారులు విచారణ చేపట్టారు.

2007 నుంచి 2012 మధ్య ఐదేళ్ల కాలంలో ద్వారకా దాస్ సేథ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రూ.389 కోట్లు అప్పు తీసుకున్నది. తీసుకోవటమే కానీ.. ఇప్పటి వరకు తిరిగి చెల్లించలేదు. కనీసం వడ్డీ కూడా కట్టటం లేదు. వీరు డైమండ్స్ అండ్ జ్యువెలరీస్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఢిల్లీతోపాటు ఇతర ప్రాంతాల్లో బంగారం, వజ్రాల వ్యాపారం నిర్వహిస్తున్నారు. అప్పు తీసుకుని చెల్లించటంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో కంపెనీ డైరెక్టర్లు సభ్యసేథ్, రీటాసేథ్, క్రిష్ణకుమార్ సింగ్, రవి సింగ్ లపై కేసు నమోదు అయ్యింది. ఒక్క బ్యాంక్ లోనే ఇలా చేశారా.. మిగతా బ్యాంకుల్లోనూ అప్పులు చేశారా అనే విషయాలపై ఆరా తీస్తున్నారు అధికారులు..

Posted in Uncategorized

Latest Updates