ఎవడబ్బ సొమ్మని రా : 11 ఏళ్లలో రూ.2.60లక్షల కోట్లు రద్దు

Bank-robberyకేంద్రానికి..  ప్రభుత్వ రంగ బ్యాంకులు తలనొప్పిగా మారాయి. ఓ వైపు పథకాలకు నిధుల చెల్లింపుతోపాటు.. మరో వైపు బ్యాంకుల్లోకి ప్రభుత్వ నిధులు పంపింగ్ చేయటం. ప్రతి ఏటా పెరిగిపోతున్న బ్యాంకుల్లోని రుణాల రద్దుతో వాటి ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. కార్పొరేట్ చీటింగ్ కు బ్యాంకులు అడ్డాగా మారాయి. గత 11 సంవత్సరాల్లో ముగ్గురు ఆర్థిక మంత్రులు ప్రణబ్, చిదంబరం, అరుణ్ జైట్లీ హయాంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోకి అక్షరాల రూ.2లక్షల 60వేల కోట్లను సమకూర్చారు. ఈ డబ్బు అంతా ఆయా బ్యాంకులు ఇచ్చిన రుణాలను తిరిగి రాబట్టుకోవటంలో విఫలం అయ్యాయి. దీంతో బ్యాంకుల్లో నిధుల కొరత లేకుండా చూడటం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రజా సొమ్మును పంపింగ్ చేసింది. అంటే ఈ 11 ఏళ్లలో బ్యాంకులు రూ.2.60లక్షల కోట్లను రద్దు చేశాయి అన్న మాట.

11 ఏళ్లలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోకి కేంద్రం నిధులు

2010-11         : 18వేల 617 కోట్లు

2011-12         : 12వేల 000 కోట్లు

2012-13        : 12వేల 517 కోట్లు

2013- 14       : 14వేల 000 కోట్లు

2014 – 15      : 06 వేల 990 కోట్లు

2015- 16       : 25వేల కోట్లు

2016 – 17      : 24వేల 997 కోట్లు

2017-18        : 80వేల కోట్లు

2018 – 19      : 65వేల కోట్లు

ఈ లెక్కలు బయటకు రావటంతో ఇప్పుడు దేశం మొత్తం నివ్వెరపోతుంది. ఈ సారి బడ్జెట్ లో రూరల్ డెవలప్ మెంట్ కోసం కేటాయించిన విడుదల చేసిన నిధుల కంటే.. ఇది రెండింతలు. అంతేకాదండీ.. 2జీపై కాగ్ రిపోర్ట్ చెప్పిన దాని కంటే ఎక్కువ. దేశవ్యాప్తంగా రోడ్ల నిర్మాణానికి కేటాయించిన నిధుల కంటే మూడింతలు. అంటే బ్యాంకుల్లో జరుగుతున్న దోపిడీని అరికట్టగలిగితే ఎప్పుడో అభివృద్ధి చెందేది అన్న మాట. కేంద్రం ప్రభుత్వ రంగ బ్యాంకులు గత 11 ఏళ్లలో రూ.2.60లక్షల కోట్లను అప్పులను రద్దు చేశారు. అంటే.. ఇంకా ఎంతెంత సొమ్ము దోపిడీదారుల పరం అయ్యిందో..

Posted in Uncategorized

Latest Updates