ఎవరామె? : కోఠి ఆస్పత్రిలో పసికందు మాయం

papaహైదరాబాద్ కోఠి సుల్తాన్ బజార్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఆరు రోజుల పసికందు మాయం అయ్యింది. ఓ మహిళ ఎత్తుకెళ్లినట్లు సీసీ కెమెరా ద్వారా గుర్తించారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఎల్లమ్మ తండాకు చెందిన విజయ అనే మహిళ.. డెలివరీ కోసం సుల్తాన్ బజార్ గవర్నమెంట్ హాస్పిటల్లో చేరింది. ఆడ శిశువుకు జన్మనిచ్చింది.

ఆమె కదల్లేని స్థితిలో ఉండటంతో ఓ మహిళ టీకాలు వేయిస్తానని నమ్మించి శిశువును తీస్కెళ్లింది. ఎంతకీ రాకపోవడంతో.. ఆస్పత్రి సిబ్బందికి సమాచారమిచ్చింది. దీంతో విషయం వెలుగులోకొచ్చింది. ఆస్పత్రి స్టాఫ్ సుల్తాన్ బజార్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మహిళను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. అన్ని పోలీస్ స్టేషన్లతోపాటు బస్టాండ్, రైల్వేస్టేషన్లలో కూడా నిఘా పెట్టారు. ఆస్పత్రి నుంచి బయటకు వెళ్లిన మహిళ ఎక్కడెక్కడికి వెళ్లిందీ అనేది తెలుసుకోవటం కోసం ఆయా రహదారుల్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. ఆటోలు, క్యాబ్ డ్రైవర్ల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates