ఎవరూ గుర్తు పట్టలేదు : అప్పడాలు అమ్మిన స్టార్ హీరో

636548158816228928క్రిష్ సినిమాతో బాలీవుడ్ హీరో ఎలాంటి వైవిధ్యంక నబరిచాడో తెలిసిందే. కంటెంట్ లో బలం ఉంటే చాలు ఎలాంటి క్యారెక్టర్ కైనా ఓకే చెప్పే హృతిక్ రోషన్ లేటెస్ట్ గా మరో అవతారమెత్తాడు. అప్పడాలు అమ్ముకునే క్యారెక్టర్ లో జీవించేశాడు. ఓ పల్లెటూరిలో సైకిల్ పై అప్పడాలు అమ్ముతూ కనిపించాడు.

పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న తన సినిమా కోసం అచ్చం పల్లెటూరి వ్యక్తిలా మారిపోయాడు బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్. సినిమా పేరు సూపర్ 30. షూటింగ్ గ్యాప్ లో హృతిక్ సైకిల్‌పై అప్పడాలు అమ్మే గెటప్ లోనే పల్లెటూరిలో తిరిగాడంట. ఎవరూ గుర్తు పట్టలేదంట. నిజంగా అప్పడాల అబ్బాయి వచ్చాడని అనుకున్నారంట. ఒక్కో అప్పడం రూ. 5 అమ్మాడంట. పాత్రలో జీవించటం అంటే ఇదే అంటున్నారు. నెటిజన్లు అయితే తెగ కామెంట్స్ చేసేస్తున్నారు. సినిమాలు లేనప్పుడు సైడ్ బిజినెస్ గా పనికొస్తుందంటూ సెటైర్లు వేస్తున్నారు. ఈ సినిమాలో హృతిక్ సరసన మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. కీలక పాత్రలో సారా అలీఖాన్ నటిస్తోంది.

Posted in Uncategorized

Latest Updates