ఎస్సారెస్పీ చరిత్రలోనే ఇది తొలిసారి

srspwaterవారంరోజులుగా మహారాష్ట్రలో కురుస్తున్న భారీవర్షాలతో ఆ రాష్ట్రంలోని బాబ్లీ ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతుంది. ఆదివారం అర్ధరాత్రి పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోవడం, భారీగా ఇన్‌ఫ్లో ఉండటంతో అధికారులు ముందు జాగ్రత్తచర్యగా సోమవారం వివిధ దశల్లో నాలుగు గేట్లను ఎత్తారు. సోమవారం ఉదయం 11 గంటలకు రెండు గేట్లను ఎత్తి 20వేల క్యూసెక్కుల నీటిని, మధ్యాహ్నానికి మూడో గేటును ఎత్తి 79,452 క్యూసెక్కులు, సాయంత్రం నాలుగో గేటు ఎత్తి 98,873 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. దిగువకు వదిలిన వరద నీరు శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. వర్షాకాలం సీజన్ ప్రారంభంలో ఎస్సారెస్పీలోకి ఇంత భారీ ఇన్‌ఫ్లో వచ్చి చేరడంతో ఈ ప్రాజెక్టు చరిత్రలోనే తొలిసారి. గతానికి భిన్నంగా జూన్ రెండోవారంలోనే బాబ్లీ నుంచి ఎస్సారెస్పీకి నీటి విడుదల శుభపరిణామంగా అభివర్ణిస్తున్నారు ఇంజనీర్లు.

Posted in Uncategorized

Latest Updates