ఎస్సీ, ఎస్టీల  రక్షణకు  ప్రత్యేక చర్యలు

ఎస్సీ, ఎస్టీల  రక్షణకు  ప్రభుత్వం  ప్రత్యేక చర్యలు  తీసుకుంటుందన్నారు  డిప్యూటీ సీఎం  మహమూద్ అలీ, హోంమంత్రి  నాయిని నర్సింహారెడ్డి.  అన్నివర్గాల  సంక్షేమం కోసం  ప్రభుత్వం  పనిచేస్తోందని  చెప్పారు. ఎస్సీ, ఎస్టీలకు  ఎక్కడ అన్యాయం  జరిగినా ….వారి తరపున  పోరాడతామన్నారు  కమిషన్  చైర్మన్  ఎర్రోళ్ల శ్రీనివాస్.  పరిశ్రమ భవన్ లో  ఎస్సీ,  ఎస్టీ కమిషన్  కార్యాలయం  ప్రారంభోత్సవంలో  పాల్గొన్నారు  నేతలు. కొత్త ఆఫీసును  మండలి  చైర్మన్  స్వామిగౌడ్  ప్రారంభించారు. ఈ  కార్యక్రమంలో మంత్రి  హరీశ్ రావు,  మండలి  ప్రభుత్వ  విప్  పాతూరి  సుధాకర్ రెడ్డి,  ప్రభుత్వ  సలహాదారు   వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు.

Posted in Uncategorized

Latest Updates