ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ని తొమ్మిదో షెడ్యూల్ లో చేర్చాలి: మందకృష్ణ

రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ని చేర్చాలని డిమాండ్ చేశారు ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం పునరుద్ధరణపై.. కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం అమలవుతుందని నమ్మకం లేదన్నారు. గతంలో మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలు అమలైన దాఖలాలు లేవన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ను పరిరక్షంచాలంటూ.. ఢిల్లీ రాంలీలా మైదానంలో దళిత గిరిజనుల ఆందోళనల చేపడతామన్నారు. 5న ప్రారంభం కానున్న సింహగర్జనకు వేలాదిగా దళిత గిరిజనులు తరలిరావాలని పిలుపునిచ్చారు మంద కృష్ణ.

Posted in Uncategorized

Latest Updates