ఎస్సీ, ఎస్టీ చట్టంపై కేంద్రం కీలక నిర్ణయం

ఎస్సీ, ఎస్టీ చట్టంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రామ్ విలాస్ సారధ్యంలోని లోక్ జనశక్తి పార్టీ, రామ్ దాస్ అథవాలే సారధ్యంలోని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, ఇతర దళిత సంఘాల డిమాండ్లతో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ.. దళిత సంఘాలు ఆగస్టు-9వ తేదీన భారత్ బంద్‌ కు పిలుపునిచ్చిన సమయంలో బుధవారం(ఆగస్టు-1) కేంద్ర క్యాబినెట్ సమావేశమైంది. ఎస్సీ, ఎస్టీ చట్టంలోని కఠినతరమైన నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయకూడదని మంత్రివర్గం నిర్ణయించింది. దీని కోసం ప్రత్యేకంగా పార్లమెంట్‌ లో బిల్లును ప్రవేశపెట్టాలని కూడా నిర్ణయించింది. ఈ వర్షాకాల సమావేశాల్లోనే… ఎస్సీ, ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.

Posted in Uncategorized

Latest Updates