SBIను 12 నెలల్లో ప్లాస్టిక్ ఫ్రీగా మారుస్తాం

ఢిల్లీ:  సంవత్సరంలోపు తమ సంస్థను ప్లాస్టిక్ ఫ్రీ గా మారుస్తామని ఎస్ బీఐ ఛైర్మన్ రజనీశ్ కుమార్ తెలిపారు.  మహాత్మగాంధీ జయంతి సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు. సంస్థను ప్లాస్టిక్ ఫ్రీగా మార్చేందుకు షెడ్యూల్ వారీగా చర్యలు తీసుకుంటామన్న ఆయన.. ఆఫీసులు,మీటింగ్స్ లో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ స్థానంలో వాటర్ డిస్పెనర్స్, ప్లాస్టిక్ ఫోల్డర్లు కాకుండా పేపర్ ఫోల్డర్లు వాడతామని తెలిపారు.

స్వచ్ఛ ఇంధనాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ఎస్ బీఐ ఇవాళ(అక్టోబర్ 2) న మంగళవారం ఎలక్ట్రిక్‌‌ వాహనాన్ని కొనుగోలు చేసింది. 2030 లోపు 100 శాతం ఎలక్ట్రిక్‌ వాహనాలే వినియోగిస్తామని సంస్థ హామీ ఇచ్చింది.

 

Posted in Uncategorized

Latest Updates