ఏంటయ్యా ఈ ఘోరం : చిన్నారిని కొరికి చంపిన కుక్క

dogs-attackఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనుషులపై జంతువుల దాడులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. గుంటూరు ఆస్పత్రిలో ఎలుక కొరికి చిన్నారి మృతి, ఆ ఘటన తర్వాత కుక్కల దాడిలో మరో చిన్నారి చనిపోయాడు. నెల్లూరులో పందుల దాడిలో గాయపడ్డారు. ఇప్పుడు మరో ఘోరం. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం చిట్యాల గ్రామంలో జరిగిన ఈ ఘోరంతో అందరూ షాక్ అయ్యారు.

తలారి హుస్సేన్, చాంద్ బీ దంపతులకు నాలుగేళ్ల కుమారుడు ఇబ్రహీం ఉన్నాడు. ఫిబ్రవరి 20వ తేదీ మంగళవారం చిన్నారిని తీసుకుని పొలం వెళ్లారు. అక్కడే ఓ చెట్టుకు చీరతో ఉయ్యాల వేశారు. అందులో ఇబ్రహీంని పడుకోబెట్టి.. పొలం పనులు చేస్తున్నారు దంపతులు. ఆ సమయంలో ఓ కుక్క చిన్నారిపై దాడి చేసింది. గొంతు కొరికింది. ముఖం అంతా ఇష్టానుసారం కొరికేసింది. ఛిద్రం చేసింది. కొద్దిసేపటి తర్వాత వచ్చిన చూసిన వారు షాక్ అయ్యారు. పక్కనే ఉన్న కుక్క నోట్లో చిన్నారి శరీర భాగాలు కూడా ఉన్నాయి. దాన్ని తరిమికొట్టి.. చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చనిపోయినట్లు తెలిపారు డాక్టర్లు. కుక్క దాడిలో చనిపోయిన బాబుని చూసి ఊరంతా కన్నీళ్లు పెట్టుకుంది. బాబు ముఖం చూసిన వారంతా షాక్ అవుతున్నారు.

Posted in Uncategorized

Latest Updates