ఏం చెప్తారో : RSS ఈవెంట్ కోసం నాగ్ పూర్ చేరుకున్న ప్రణబ్ ముఖర్జీ

nagగురువారం(జూన్-7) నాగ్ పూర్ ఆరెస్సెస్ హెడ్ క్వార్టర్స్ లో జరిగే ఈవెంట్ లో ముఖ్య అతిధిగా పాల్గొనేందుకు బుధవారం నాగ్ పూర్ చేరుకున్నారు మాజీ రాష్ట్రపతి డాక్టర్ ప్రణబ్ ముఖర్జీ. ఎయిర్ పోర్ట్ లో ఆరెస్సెస్ ప్రముఖులు, కార్యకర్తలు ప్రణబ్ కు స్వాగతం పలికారు. ఆరెస్సెస్ కార్యకర్తలను ఉద్దేశించి రేపు ప్రణబ్ మాట్లాడనున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం కొనసాగి ఆరెస్సెస్ కార్యక్రమానికి ప్రణబ్ హాజరవడంపై పలువురు కాంగ్రెస్ నాయకులు బహిరంగంగానే తప్పుపడుతున్నారు. ఇటీవల ఆరెస్సెస్ ను ఉగ్రవాద సంస్ధగా కాంగ్రెస్ అధ్యక్షడు రాహుల్ గాంధీ వర్ణించారు. అయితే ఆరెస్సెస్  విషయమై ఓ బెంగాళీ పత్రికకు మూడు రోజుల క్రితం ఇచ్చిన ఇంటర్యూలో… అన్నీ విషయాలు నాగ్ పూర్ మీటింగ్ లోనే చెప్పానని ప్రణబ్ తెలిపారు. మరోవైపు కాంగ్రెస్, బీజేపీయేతర కూటమిని ప్రణబ్ ఏర్పాటు చేస్తారని, ప్రణబ్ ఈజ్ బ్యాక్ అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.

Posted in Uncategorized

Latest Updates