ఏం జరిగింది : అన్నపూర్ణ స్టూడియోలో అనుమానాస్పద మృతి

annaఅన్నపూర్ణ స్టూడియోలో పని చేస్తున్న నారాయణరెడ్డి(53) అనే వ్యక్తి అనుమానాస్పద స్ధితిలో చనిపోయాడు. బంధువులకు కూడా ఎటువంటి సమాచారం ఇవ్వకుండా గుట్టు చప్పుడు కాకుండా ఆయన మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు స్టూడియో సిబ్బంది. దీంతో ఇది హత్యగా భావిస్తూ నారయణ రెడ్డి బంధువులు ఉస్మానియా హాస్పిటల్ దగ్గర ఆందోళనకు దిగారు. తమకు చనిపోయమాడన్న సమాచారం ఇవ్వకపోవడాన్ని వారు తప్పు పడుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అన్నపూర్ణ స్టూడియోకు వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates