ఏం దర్జా : అటు బస్సు.. ఇటు లారీ.. మధ్యలో రాంగ్ రూట్ లో పోలీస్ వెహికల్

wrong-route

పోలీస్.. ఒంటిపై ఖాకీ దుస్తులు వస్తే చాలు ఆ దర్జానే వేరు. పోలీస్ అనే భావన వచ్చేస్తోంది. అందుకే ఇటీవల ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటున్నారు. ప్రజలు చేస్తే తప్పు.. మేం చేస్తే ఒప్పు అనే ధోరణో ఏమోగానీ.. ఓ పోలీస్ వాహనం రాంగ్ రూట్ లో వెళ్లింది. ఎంతో దర్జాగా అంటే.. అటూ ఇటూ.. ముందూ వాహనాలు పెద్ద సంఖ్యలో వస్తున్నాయి. అయినా ఏ మాత్రం బెరుకు లేకుండా.. ఎదురు వచ్చే వాహనాల భద్రతను గాలికి వదిలేసి మరీ ఇలా వెళ్లింది పోలీస్ వాహనం.

ఎల్బీనగర్ రింగ్ రోడ్డు దగ్గర కనిపించిన ఈ చిత్రాన్ని బంధించిన ఓ వ్యక్తి.. ఈ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ లింక్ ను మంత్రి కేటీఆర్ కు పంపించారు. పోలీస్ వెహికల్ రాంగ్ రూట్ లో వెళుతుంది.. ఇదే పబ్లిక్ చేస్తే ఈ పోలీసులు ఏం చేస్తారు అంటూ ప్రశ్నించారు. ఈ పోస్ట్ పై స్పందించారు మంత్రి కేటీఆర్.  ఆ ఫొటోను రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ కు షేర్ చేశారు. ఇలాంటి ఉల్లంఘనలపై పరిశీలించాలని.. సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని ట్వీట్‌ చేశారు. ఈ ఫొటోకు పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి అప్పటికే.

మంత్రి కేటీఆర్ నుంచి వచ్చిన ట్విట్ పై స్పందించారు రాచకొండ కమిషనర్‌. ట్విట్టర్‌ ద్వారా తేదీ, సమయం తెలుసుకున్నారు. మే 23వ తేదీ మధ్యాహ్నం 3-4 గంటల మధ్య అని నిర్థారణకు వచ్చారు. ఆ సమయంలో వాహనం నడిపిన సిబ్బంది ఆరా తీశారు. TS09 PA 0651 వాహనం నడిపిన డ్రైవర్‌ ఏఆర్‌ కానిస్టేబుల్‌ రంగన్నగా గుర్తించారు. అదే వాహనంలో ఉన్న LB నగర్‌ పీఎస్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ బుగ్గరాములుపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆ వాహనంపై చలానా విధించారు. ఇలాంటివి పునరావృతం కాకుండా శిక్షణ ఇస్తామని కేటీఆర్ కు రీ ట్వీట్ ద్వారా తెలియజేశారు రాచకొండ కమిషనర్‌. మంత్రి కేటీఆర్, రాచకొండ కమిషనర్ స్పందించిన తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates