ఏం పగ ఉందో : ముగ్గురిపై దాడి చేసిన కుక్క

kukkaఢిల్లీలో ఓ కుక్క స్వైరవిహారం చేసింది. ఉత్తమ్ నగర్ లో బుధవారం(మార్చి28) న వీధిలో ఆడుకుంటున్న ఓ పిల్లాడి పై పిట్ బుల్ టెరియర్ అనే ఓ కుక్క అకస్మాత్తుగా దాడి చేసింది.దీంతో అక్కడున్న వారంతా పరుగులు పెట్టారు. కుక్క దాడిని గమనించిన పిల్లాడి తల్లి…కుక్క నుంచి కొడుకును కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించింది.  వెంటనే పక్కనే ఉన్న మరో మహిళ ఆ కుక్కను కర్రతో చావబాదింది. మరో యువకుడు కుర్చీతో ఆ కుక్కను చావబాదాడు. అయితే పిల్లాడిని విడిచిపెట్టి కుర్చీతో కొట్టిన యువకుడి వెంటపడింది. ఈ కుక్క దాడిలో ముగ్గరూ తీవ్రంగా గాయపడ్డారు. అమెరికా జాతికి చెందిన ఈ కుక్క బలమైన దవడలు, ఇటుక లాంటి తల కలిగి ఉంది.

Posted in Uncategorized

Latest Updates