ఏం మొగుడు రా బాబూ : కట్నం కింద భార్య కిడ్నీ అమ్మేశాడు

kidneyపెళ్లి సమయంలో అడిగినంత కట్నం ఇవ్వక పోతే.. ఆ పెళ్లి కొడుకు కుటుంబం కట్నం కోసం వేధించడం అనే మాట వింటుంటాం. ఈ మొగుడు మాత్రం అందుకు భిన్నం. కట్నం కింద ఏకంగా భార్య కిడ్నీనే అమ్మేశాడు. అది కూడా 12 ఏళ్ల తర్వాత. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకుంది.

కోల్‌క‌తాకు చెందిన బిస్వజిత్‌.. రీటా అనే యువతితో 12 ఏళ్ల కిందట పెళ్లి జరిగింది. కట్నంగా ఇస్తామన్న రూ.2 లక్షలు ఇవ్వలేదు. ఇన్నాళ్లుగా వేధిస్తూనే ఉన్నాడు. అయినా రీటా తల్లిదండ్రులు డబ్బు సర్దుబాటు చేయలేకపోయారు. ఇక ఇవ్వరని డిసైడ్ అయ్యాడు. రెండేళ్ల కిందట రీటాకు కడుపునొప్పి రావడంతో భర్త బిస్వజిత్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు భర్త. అప్పట్లో తీవ్ర కడుపునొప్పి అని.. అపెండిక్స్ ఆపరేషన్ చేశారని చెప్పాడు. అప్పట్లో నిజమే అని అందరూ అనుకున్నారు.

ఇటీవల రీటాకి మళ్లీ తీవ్ర నొప్పి వచ్చింది. బంధువులు నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజ్ అండ్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. స్కాన్ చేసిన డాక్టర్లు.. కుడి వైపు కిడ్నీ చెప్పారు. రీటా షాక్ అయ్యింది. భర్తను నిలదీసింది. అప్పుడు అసలు విషయం చెప్పాడు. రెండేళ్ల క్రితం అపెండిక్స్ ఆపరేషన్ అని చెప్పింది అబద్ధం.. కిడ్నీ తీసుకుని అమ్మేసుకున్నాని అని చెప్పాడు. కట్నం కింద జమ చేసుకో అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. పోలీస్ కేసు పెట్టింది. భర్త బిస్వజిత్ ను అదుపులోకి తీసుకున్నారు. సర్జరీ చేసిన ఆస్పత్రిపై దాడులు చేశారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ వ్యాపారవేత్తకు కిడ్నీ అమ్మేసినట్టు బిస్వజిత్‌ నేరాన్నిఅంగీకరించాడు. కిడ్నీ స్మగ్లింగ్ గ్యాంగ్ హస్తం ఉందనే కోణంలోనూ విచారణ జరుగుతుంది.

Posted in Uncategorized

Latest Updates